BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 07:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో కూటమి చైర్‌పర్సన్ మాధవి, 24 మంది కౌన్సిలర్లకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 07:47 PM
26 వీక్షణలు

ఎన్నికల విజయంతో బాధ్యత మరింత పెరిగింది.. పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే ఘన విజయం సాధ్యమైంది ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: ఇటీవల జరిగిన తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి బలపరిచిన చైర్‌పర్సన్ పసుపులేటి మాధవితో పాటు కౌన్సిలర్లను పట్టణ తెలుగుదేశం పార్టీ ఘనంగా సన్మానించింది. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రజాప్రతినిధులను అభినందిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం తిరువూరు పట్టణంలో రాజకీయ సందడిని నెలకొల్పింది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 24 మంది కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లెల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో అనేక అక్రమాలు, అన్యాయాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. నలుగురు అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపజేసి ఏకగ్రీవాలు చేయించిన ఘటనలు అప్పట్లో జరిగాయని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సూచన మేరకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి తిరువూరు ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఐక్యంగా శ్రమించడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పట్టణ సమగ్రాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సన్మానం అందుకున్న చైర్‌పర్సన్ పసుపులేటి మాధవి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించిన తిరువూరు పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతను గుర్తించి, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సహకారంతో పట్టణ సమగ్రాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, కూటమి పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.