BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 07:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడులో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 07:47 PM
24 వీక్షణలు

పూర్తిగా దగ్ధమైన ఇల్లు మేకల ఇస్సాకు కుటుంబానికి తీరని ఆస్తి నష్టం ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు, నవంబర్ 9: ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంలోని మాలపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మేకల ఇస్సాకు అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. కష్టపడి నిర్మించుకున్న ఇల్లు కళ్లముందే మంటల్లో కాలిపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇంట్లోని విలువైన వస్తువులు, నిత్యావసర సామగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో కుటుంబానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఒక్క ప్రమాదంతో నిలువ నీడ కోల్పోయిన బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలించాలని, బాధిత కుటుంబానికి జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇల్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.