BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో నవంబర్ 15న వంగవీటి రంగా విగ్రహావిష్కరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Oct, 2026 - 04:12 PM
8 వీక్షణలు

ఆర్చి సెంటర్‌లో ఉదయం 10.15 గంటలకు కార్యక్రమం.. మున్సిపల్ చైర్‌పర్సన్ సుజాతకు ఆహ్వానం

మధిర, అక్టోబర్ 8: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణకు తేదీ, సమయం ఖరారయ్యాయి. నవంబర్ 15వ తేదీ ఉదయం 10.15 గంటలకు మధిర–వైరా ప్రధాన రహదారిలోని కొండలరావు హాస్పిటల్ సమీపంలోని జిలుగుమాడు ఆర్చి రింగ్ సర్కిల్ సెంటర్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

మధిర పట్టణంలోని లడ్కా బజార్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఉన్న మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం మధిర నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ల కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లు, ఆహ్వానాలు, కార్యక్రమ నిర్వహణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.

మధిర పట్టణ నడిబొడ్డున వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని నాయకులు పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మున్నూరు కాపు సంఘాల నాయకులు, రంగా అభిమానులను ఆహ్వానించాలని నిర్ణయించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు.

అనంతరం మున్నూరు కాపు సంఘం నాయకులు మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి, నవంబర్ 15న నిర్వహించనున్న వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. దీనికి చైర్‌పర్సన్ సుజాత సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.

ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, మాజీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు రామారావు, 8వ వార్డు కౌన్సిలర్ యన్నం కోటేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, మధిర నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి కృష్ణ, మండల అధ్యక్షుడు గంగిశెట్టి చిరంజీవి, తిరివీధుల రమేష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు కొఠారి రాఘవ, టీడీపీ సీనియర్ నాయకులు రావూరి రంగయ్య, పసుపులేటి సత్యనారాయణ, జున్ను సుదర్శన్, బీజేపీ నాయకులు రాంశెట్టి నాగేశ్వరరావు, రామిశెట్టి శ్రీనివాసరావు, చిన్నం వెంకటేశ్వరరావు, ఎక్కటీల కృష్ణారావు, లంకె మల్ల నాగేశ్వరరావు, వీరశెట్టి సీతారామయ్య, పాలెపు వెంకటేశ్వర్లు, ఆకుల స్వామి, పగడాల శివ, రామిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.