గొల్లపల్లి రఘునాథ స్వామి ఆలయంలో వరుణయాగం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రఘునాథ స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వరుణయాగ కార్యక్రమంలో భాగంగా నూజివీడు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు మంచి దిగుబడులు ఇవ్వాలని ప్రార్థనలు చేశారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.