BREAKING
thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు
Date of Publish : 07 October 2026, 11:26 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బోయకొండలో ఘనంగా వరుణ యాగం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 11:26 AM
1 వీక్షణలు

బోయకొండలో ఘనంగా వరుణ యాగం.. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా: ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని ప్రముఖ శక్తిక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం వరుణ యాగం, వరుణ జపం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ అధికారులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మధుసూదన్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో, డిప్యూటీ కమిషనర్ జె. ఏకాంబరం ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.

అనంతరం మధుసూదన్ నాయుడు బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ యాగం, వరుణ జపంలో భాగంగా నిర్వహించిన హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.

వర్షాలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ నాయకుడు మధు రాయల్, జనసేన పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చిన్న రాయల్, బీజేపీ ఇన్‌చార్జి మదన్మోహన్, బోయకొండ సుబ్బు, కుమార్ రెడ్డితో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.