BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 03:59 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ప్రమాద బాధిత కుటుంబానికి వివేకానంద పొదుపు సంఘం ఆర్థిక భరోసా

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
26 Nov, 2026 - 03:59 PM
20 వీక్షణలు

మొదటి విడతగా రూ.80 వేల బీమా సాయం అందజేత.. రెండో విడతలో మరో రూ.2 లక్షలు

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి, నవంబర్ 26 – ఎన్ టుడే న్యూస్: ఆపద సమయంలో సభ్యుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు వివేకానంద పురుషుల పొదుపు సంఘం ముందుకొచ్చింది. ఎల్కతుర్తిలో వడ్లకొండ రాజు (తండ్రి సారయ్య) భార్య రవళికి సంఘం తరఫున బీమా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మొదటి విడత కింద రూ.80,000 నగదును రవళికి అందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రెండో విడతలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా మరో రూ.2 లక్షలు అందనున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. పొదుపు సంఘంలో సభ్యులుగా ఉన్నవారు తమ నెలవారీ వాయిదాలు, బకాయిలను క్రమం తప్పకుండా సకాలంలో చెల్లించాలని సూచించారు. వాయిదాలు సక్రమంగా చెల్లించే సభ్యులకు ఆపద సమయంలో బీమా సదుపాయాలతో పాటు ప్రభుత్వ, సంఘ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

సభ్యులు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఇలాంటి బీమా, సంక్షేమ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఆపద సమయంలో పొదుపు సంఘాలు సభ్యుల కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద పురుషుల పొదుపు సంఘం సమితి అధ్యక్షుడు కంచర్ల కృష్ణమూర్తి, అధ్యక్షుడు డా. ప్రభాకర్, ఉపాధ్యక్షుడు రమేష్, సంఘం సభ్యులు శీలం అనిల్ కుమార్, నాగరాజు, చంద్రమౌళి, రవి సార్, అల్లి కిరణ్, వెల్డింగ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.