BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 04:54 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నాగార్జున సాగర్‌పై మళ్లీ జలవివాదం.. తెలంగాణ, ఏపీ మధ్య పోటాపోటీగా నీటి విడుదల

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:54 PM
19 వీక్షణలు

అనుమతి లేకుండానే కుడి కాలువకు నీరు విడుదల చేశారని తెలంగాణ అధికారుల అభ్యంతరం

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్‌పై మరోసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వివాదం తెరపైకి వచ్చింది. తాగునీటి అవసరాల పేరుతో ఏపీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో వివాదం మొదలైంది.

ఏపీ అధికారులు నీటిని విడుదల చేసిన వెంటనే తెలంగాణ అధికారులు స్పందించారు. ఎడమ కాలువకు కూడా నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ నుంచి రెండు రాష్ట్రాలు పోటాపోటీగా నీటిని విడుదల చేసే పరిస్థితి ఏర్పడింది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా, త్రీమెన్ కమిటీ అనుమతి తీసుకోకుండానే ఏపీ అధికారులు ఏకపక్షంగా నీటిని విడుదల చేశారని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ తనకు కేటాయించిన నీటి వాటా కంటే ఎక్కువగా వినియోగించుకుందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాలతో నాగార్జున సాగర్ నీటి విడుదల వ్యవహారం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది.