BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెల్లదేవరపల్లి భూములకు రెడ్‌మార్క్ తొలగిస్తాం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 09:45 PM
7 వీక్షణలు

తెల్లదేవరపల్లి భూములకు రెడ్‌మార్క్ తొలగిస్తాం  సాగుదారులకు పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తామని ఆర్డీవో హామీ

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాలకు చెందిన సాగుదారులు దీర్ఘకాలంగా సాగు చేస్తున్న భూములకు ఉన్న రెడ్‌మార్క్‌ను తొలగించి పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తిరువూరు ఆర్డీవో హామీ ఇచ్చినట్లు సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ తెలిపారు.

తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన సాగుదారులతో కలిసి డి.హరినాథ్ తిరువూరులో ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. సుమారు 70 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు రెడ్‌మార్క్ ఉండటంతో సాగుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై స్పందించిన ఆర్డీవో సంబంధిత భూముల వివరాలను పరిశీలించి రెడ్‌మార్క్ తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, అర్హత ఉన్న సాగుదారులకు పట్టాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు హరినాథ్ పేర్కొన్నారు.

సర్వే నంబర్లు 280, 281, 282, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 295, 300, 303, 304, 305, 311, 331, 333, 334, 335, 341లో కలిపి సుమారు 231.95 ఎకరాల భూములకు సాగుదారులు సిస్తులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి సాగు చేస్తున్న వారిని గుర్తించినట్లు చెప్పారు.

ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదురవుతున్నాయని హరినాథ్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలు నష్టపోయినా ప్రభుత్వ పరిహారం పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు పొందడంలోనూ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

కుటుంబ అవసరాల కోసం, ముఖ్యంగా కుమార్తెల వివాహాల సమయంలో భూమిని పసుపు కుంకుమ కింద ఇచ్చిన సందర్భాల్లో కూడా హక్కులను నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. భూమిపై చట్టబద్ధమైన హక్కులు స్పష్టంగా లేకపోవడం వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.

రైతు భరోసా వంటి ప్రభుత్వ వ్యవసాయ ప్రయోజనాలు కూడా అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హరినాథ్ పేర్కొన్నారు. సాగుదారుల సమస్యను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన వారికి భూమిపై హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబాలకు భూ హక్కులు కల్పించడం ద్వారా వారి జీవనోపాధికి భద్రత కలుగుతుందని హరినాథ్ తెలిపారు. ఆర్డీవో ఇచ్చిన హామీ మేరకు రెడ్‌మార్క్ తొలగింపు, పట్టాల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.