BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 12:33 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
18 Nov, 2026 - 12:33 PM
21 వీక్షణలు

ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలి

వెల్గటూర్ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి చెందిన జై హనుమాన్ డిజిటల్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ (రిజి. నం. 687/2026) ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సంప మౌళి, ప్రధాన కార్యదర్శి కుశనపల్లి దుర్గయ్య మాట్లాడుతూ, ఎండనక, వాననక ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణా రంగంలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి తగిన గుర్తింపు, భద్రత కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలులోకి వచ్చిన తర్వాత ఆటోల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గి డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. కుటుంబాలను పోషించడం కూడా భారంగా మారిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య బీమా హెల్త్ కార్డులు అందించాలని, ఆటోలను నిలిపేందుకు ప్రత్యేక స్థలాలు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సంప మౌళి, ప్రధాన కార్యదర్శి కుశనపల్లి దుర్గయ్య, కోశాధికారి బిడ్డాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు అనుముల నారాయణ, ఉపాధ్యక్షులు జగడం కోటేశ్వర్, నక్క ప్రసాద్, జాయింట్ సెక్రటరీలు మాదాసు అశోక్, మీరాల రమేష్, సభ్యులు పులిపాక నరేష్, నక్క మల్లేష్, కుశనపల్లి నర్సయ్య, సంగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.