BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:55 pm
Posted by : K MAHESH

భారత రాజ్యాంగంపై మహిళలు మరింత అవగాహన పెంచుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 06:55 PM
17 వీక్షణలు

రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మహిళలు ముందుకు రావాలి: కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 26:

భారత రాజ్యాంగంపై మహిళలు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దేశానికి బలమైన రాజ్యాంగం రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు.

గురువారం భువనగిరి పట్టణంలోని ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో పాశం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రచనలో మహిళా నాయకురాళ్ల పాత్ర మరువలేనిదని అన్నారు. అంబేద్కర్‌తో పాటు సుమారు 15 మంది మహిళలు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాజ్యాంగం మహిళలకు ఓటు హక్కు, ఆస్తి హక్కుతో పాటు పురుషులతో సమానంగా పలు హక్కులు కల్పించిందని వివరించారు.

దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఆలోచనలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు రాజ్యాంగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. వరకట్న నిషేధ చట్టం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని, మహిళలకు కల్పించిన ఆస్తి హక్కును పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అనంతరం సమావేశంలో పాల్గొన్న వారందరితో భారత రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం అలివేలు, ఎన్‌ఎస్‌డీసీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రవణ్, సంస్థ డైరెక్టర్ చేగూరి జయమ్మ, ట్రైనింగ్ సెంటర్ శిక్షకురాలు పబ్బాల విజయ, శిక్షణ కేంద్రంలోని యువతులు, మహిళలు పాల్గొన్నారు.