BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 11 October 2026, 10:24 pm
Posted by : BOYA SWAMY

ప్రతి ఇంటికి యోగా చేరాలి.. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
11 Oct, 2026 - 10:24 PM
9 వీక్షణలు

చిన్నకాపర్తి (ఎన్‌ టుడే న్యూస్‌): ప్రతి ఇంటికి యోగా చేరాలని, ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ టీచర్‌ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. ‘హర్‌ ఘర్‌ ధ్యాన్‌.. జీవించడం ఒక కళ’ అనే నినాదంతో ఆదివారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో యోగా, మెడిటేషన్‌ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

గ్రామంలోని రైతు వేదిక వద్ద యోగా, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపొందించిన కరపత్రాలను గ్రామ సర్పంచ్‌ ఆవుల సుందర్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య విడుదల చేశారు. గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులకు యోగా ఆసనాలు నేర్పడంతో పాటు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ.. ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కోర్సు ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, ఆరోగ్యం, జీవశక్తిని మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని వివరించారు. యోగా, ధ్యానం, శ్వాసకు సంబంధించిన అభ్యాసాలు జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు.

సుదర్శన క్రియ ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవడంలో, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడంలో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కోనేటి యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు రఘుమారెడ్డి, అద్దెల లింగారెడ్డి, బెల్లంకొండ రఘు, ఆవుల రమేష్‌, మెట్టు నాగశంకర్‌, వలిగొండ సత్యనారాయణ, నరసింహ, ప్రశాంత్‌, అశోక్‌, వెంకన్న, దివాకర్‌, లింగయ్య, శంకరయ్య, రమేష్‌, వెంకటేష్‌, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.