BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:06 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
28 Sep, 2026 - 06:06 PM
16 వీక్షణలు

కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
సెప్టెంబర్ 29న ఒంగోలుకు రానున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాల వెల్లడి

కనిగిరి, సెప్టెంబర్ 28:
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 29న ఒంగోలుకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మృతి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన ఒంగోలుకు రానున్నట్లు తెలిపాయి.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో హెలికాప్టర్ ద్వారా చేరుకుని, అనంతరం కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఈ నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యక్రమానికి హాజరు కావాలని హనుమంతునిపాడు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ యక్కంటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

పార్టీ శ్రేణులు ఉదయం 9 గంటలకు ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోవాలని ఆయన కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాకుమాను రాజశేఖర్ మృతిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.