BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగంచిప్రోలు సర్పంచ్ బరిలో వైసీపీ అభ్యర్థి వూట్ల నాగమణి..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:45 PM
18 వీక్షణలు

వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు, నవంబర్ 20: పెనుగంచిప్రోలు మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ సందడి నెలకొంది. సర్పంచ్ పదవిని కైవసం చేసుకునే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వూట్ల నాగమణి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆమెతో పాటు పార్టీ తరఫున పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులు కూడా గురువారం నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు హాజరై అభ్యర్థులకు మద్దతు తెలిపారు. మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వూట్ల నాగేశ్వరరావు, మాజీ ఆర్‌బీకే చైర్మన్ చుంచు బెనర్జీ, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు బత్తుల రామారావు, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి, పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు పెద్ది కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షుడు చేని రాంబాబు పాల్గొన్నారు. అలాగే వైసీపీ మండల మహిళా అధ్యక్షురాలు శిరీష, మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు బొడ్డు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. పెనుగంచిప్రోలు మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవికి వైసీపీ అభ్యర్థిగా నాగమణి బరిలోకి దిగడంతో స్థానికంగా ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.