BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:48 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైఎస్ జగన్ తో కనిగిరి మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష : దద్దాల

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 06:48 PM
10 వీక్షణలు

తాడేపల్లి / కనిగిరి , తేదీ: 07.10.2026


మార్కాపురం జిల్లా లో రానున్న కనిగిరి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నేడు తాడేపల్లిలోని తన నివాసంలో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.


కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారితో కలిసి మున్సిపల్ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై 30 నిముషాలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సందర్భంగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగిన మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారన్నారు.కనిగిరి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా వైఎస్సార్సీపీ ఖాతాలో వేయాలని, అందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.అనంతరం దద్దాల నారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ, జగనన్న ఆదేశాల మేరకు కనిగిరి మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబందించి ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు పూర్తి చేశామని, చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేసి శ్రీ వై.ఎస్.జగన్ గారికి హామీ ఇవ్వడం జరిగిందని దద్దాల నారాయణ యాదవ్ వెల్లడించారు. అదేవిదంగా 2024 పార్టీ ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న మరియు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సూచించినట్లు ఆయన తెలిపారు..