BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 02:14 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పెరుగుపల్లిలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డా. దద్దాల నారాయణ యాదవ్ హౌస్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
26 Nov, 2026 - 02:14 PM
12 వీక్షణలు

సొంత నివాసంలోనే పోలీసుల నిర్బంధం.. టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆరోపణ

వెలిగండ్ల మండలం:

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వెలిగండ్ల మండలం పెరుగుపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డా. దద్దాల నారాయణ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన స్వగ్రామమైన పెరుగుపల్లిలోని సొంత నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడిని ఆయన నివాసంలోనే నిర్బంధించడంపై వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల సహకారంతో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

హౌస్ అరెస్ట్‌కు గల కారణాలపై పోలీసుల అధికారిక వివరణ అందుబాటులో లేదు.