జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
నంద్యాలలో జనసేన జోరు కొనసాగుతోంది. నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ బలోపేతమైన దిశగా ముందుకు సాగుతోంది. వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, ఎన్జీవోస్ కాలనీకి చెందిన సుమారు వంద కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. శాంతి, సంజీతమ్మ బృందాలతో కలిసి జనసేన నాయకులు రాజమడుగు చందు సుందర్ సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల పార్టీ నిబద్ధతకు ఆకర్షితులై యువత, మహిళలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డులో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.