BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 02:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌లోని ఖుర్షీద్ బిర్యానీ హోటల్‌లో 12 రకాల ఉల్లంఘనలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 02:59 PM
8 వీక్షణలు

ఫ్రోజన్ చికెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ గుర్తింపు.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ

వరంగల్: మండి బజార్‌లోని ఖుర్షీద్ బిర్యానీ హోటల్‌లో మంగళవారం టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్‌లో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల నిల్వ, వంటగది పరిశుభ్రత, సిబ్బంది ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాల్లో లోపాలు బయటపడ్డాయి.

తనిఖీల సందర్భంగా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్, సగం ఉడికించిన చికెన్‌తో పాటు సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను అధికారులు గుర్తించారు. వంటకు ఉపయోగించే ఆహార పదార్థాలను మూతలు లేకుండా నిల్వ ఉంచినట్లు పరిశీలనలో తేలింది. అలాగే వంటగదిలో బొద్దింకలు సంచరిస్తుండటం, గోడలకు బూజు పట్టి ఉండటం, నేల అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీకి అవసరమైన పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

హోటల్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను ప్రదర్శించకపోవడం, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం కూడా తనిఖీల్లో వెల్లడైంది. అదేవిధంగా పెస్ట్ కంట్రోల్ నిర్వహించినట్లు ధ్రువీకరణ పత్రాలు, ఉపయోగిస్తున్న నీటి నాణ్యతకు సంబంధించిన పరీక్ష నివేదికలు అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. ఇలా మొత్తం 12 రకాల ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో హోటల్ యజమానిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యతతో పాటు వాటిని నిల్వ చేసే విధానం, తయారీ ప్రాంతాల పరిశుభ్రత, సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు కూడా కీలకమని ఈ తనిఖీలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఆహారం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు నాణ్యత, పరిశుభ్రత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.