వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు
కదిరి: కదిరి పట్టణం ఎమ్మెల్యే కార్యాలయంలో 23వ వార్డుకు చెందిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కటిక షేక్ హస్నూ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన బాబా, రఫీక్, షాజహాన్, నౌషాద్, పీరా, రియాజ్, మస్తాన్, అషరఫ్ అలీ, భాష, ఇమ్రాన్, మహాభాష తదితరులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను వారు స్వాగతించారు.
కదిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.