దసరా నాటికి 2.18 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి: మంత్రి పొంగులేటి
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
తెలంగాణ: ప్రజా ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను కూడా కొనసాగిస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
దసరా నాటికి రాష్ట్రంలో 2.18 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించి తీరుతామని స్పష్టం చేశారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో కొన్ని నియోజకవర్గాలకే ఇళ్ల కేటాయింపులు జరిగాయని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఆధారంగా పేదలకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పొంగులేటి తెలిపారు.