క్యాండీ క్రష్‌లో 22,222 లెవెల్స్ పూర్తి.. 19 ఏళ్ల యువకుడి అరుదైన రికార్డు
బిహార్‌కు చెందిన 19 ఏళ్ల శుభమ్ కుమార్ క్యాండీ క్రష్ గేమ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 22,222 లెవెల్స్ పూర్తి చేసి ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు.
ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న శుభమ్ కుమార్ ఖాళీ సమయాల్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ ఈ రికార్డును సాధించినట్లు తెలుస్తోంది. గేమ్‌పై ఆసక్తితో క్రమంగా లెవెల్స్ పూర్తి చేస్తూ 22,222వ లెవెల్‌ను అధిగమించాడు.
క్యాండీ క్రష్ గేమ్‌కు నిర్దిష్టమైన తుది లెవెల్ అంటూ లేకపోవడం విశేషం. గేమ్ డెవలపర్లు ఎప్పటికప్పుడు కొత్త లెవెల్స్‌ను జోడిస్తుండటంతో ఆట కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో 22,222 లెవెల్స్ పూర్తి చేయడం అరుదైన ఘనతగా నిలిచింది.
శుభమ్ కుమార్ సాధించిన ఈ రికార్డుపై క్యాండీ క్రష్ అభిమానులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
మరి మీరు క్యాండీ క్రష్‌లో ఇప్పటివరకు ఎన్ని లెవెల్స్ పూర్తి చేశారు?