BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్టార్ హెల్త్‌కు రూ.2 కోట్ల జరిమానా.. ఐఆర్‌డీఏఐ కీలక చర్యలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:34 PM
21 వీక్షణలు

ఆరోగ్య బీమా పాలసీదారుల క్లెయిమ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కఠిన చర్యలు తీసుకుంది. ఆసుపత్రి ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్‌లను సరైన కారణాలు చూపకుండా తిరస్కరించడం, పాలసీదారులకు చెల్లించాల్సిన పరిహారంలో ఇష్టానుసారంగా కోతలు విధించడంపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో స్టార్ హెల్త్ కంపెనీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. క్లెయిమ్‌లను తిరస్కరించే సమయంలో అందుకు సంబంధించిన స్పష్టమైన కారణాలను వెల్లడించాలని, చెల్లింపుల్లో కోతలు విధిస్తే వాటికి సంబంధించిన లెక్కలను పాలసీదారులకు వివరించాలని సంస్థను ఆదేశించింది. అంతేకాకుండా 2022లో నిర్వహించిన తనిఖీల్లో కొవిడ్ సంబంధిత బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలోనూ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించినట్లు వెల్లడించింది. ఈ పరిణామంతో ఆరోగ్య బీమా పాలసీదారుల్లో చర్చ మొదలైంది. పాలసీ తీసుకున్న వినియోగదారులు తమ క్లెయిమ్‌ల వివరాలు, ఆసుపత్రి బిల్లులు, బీమా సంస్థ చెల్లించిన మొత్తాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ తిరస్కరణ లేదా చెల్లింపుల్లో కోతలు విధించినప్పుడు సంబంధిత కారణాలను లిఖితపూర్వకంగా కోరాలని సూచిస్తున్నారు.