BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 01:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 01:53 PM
33 వీక్షణలు

తల్లి సావిత్రీ దేవి కన్నుమూత 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస.. 

పంచూర్ గ్రామంలో విషాదఛాయలు తల్లి మృతిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం డెహ్రాడూన్‌: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సావిత్రీ దేవి (91) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ సోదరుడు మహేంద్ర వెల్లడించారు. గృహిణిగా జీవితాన్ని కొనసాగించిన సావిత్రీ దేవి పంచూర్ గ్రామంలోనే నివాసం ఉంటూ కుటుంబ సభ్యులతో గడిపేవారు. గత కొన్ని నెలలుగా ఆమె ఆరోగ్యం పలుమార్లు క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీసిన యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్తతో యోగి కుటుంబంలో విషాదం నెలకొనగా, పంచూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు సావిత్రీ దేవి మృతిపట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తల్లి ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో వెలకట్టలేని సంపద అని పేర్కొన్నారు. సావిత్రీ దేవి మరణం యోగి ఆదిత్యనాథ్ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ‘ఓం శాంతి’ అంటూ సంతాపం తెలిపారు.