పల్లె పండుగకు కనిగిరి నుంచి 27 బస్సులు
కనిగిరి: వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ కార్యక్రమానికి కనిగిరి మున్సిపాలిటీ పరిధి నుంచి 27 బస్సులను ఏర్పాటు చేసినట్లు పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ తెలిపారు.
ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులకు బస్సులను పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొనే బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నట్లు తెలిపారు.
పల్లె పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కనిగిరి నుంచి ప్రజలు ఉత్సాహంగా రామాపురం బయలుదేరుతున్నారని షేక్ ఫిరోజ్ తెలిపారు. కార్యక్రమానికి తరలివెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.