చాట్రాయి రామాలయం వద్ద గణనాథునికి 50 కేజీల లడ్డూ ప్రసాదం
చాట్రాయి రామాలయం వద్ద గణనాథునికి 50 కేజీల లడ్డూ ప్రసాదం సమర్పణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి గ్రామంలోని రామాలయం వద్ద కొలువైన శ్రీ గణనాథునికి భక్తిశ్రద్ధలతో 50 కేజీల లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు. చాట్రాయి పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ తుమ్మల రామ్మోహనరావు ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తుమ్మల జగన్మోహనరావు, తుమ్మల కరుణాకర్, నెల్లూరు సత్యం, సవరం వెంకట్రావు, శ్రీకాంత్, చంద్ర, రాంబాబు, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.