BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 05:18 PM
26 వీక్షణలు

విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికల అందజేత.. ఆకట్టుకున్న చిన్నారుల భరతనాట్యం

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని గ్రేడ్‌-1 శాఖా గ్రంథాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల ప్రదానం, విజ్ఞాన ప్రాధాన్యతను చాటిచెప్పే సందేశాలతో సందడిగా సాగాయి. తొలుత కుమారి యన్. లక్ష్మీ నాగ సాయి ప్రణతి, కుమారి యన్. నాగ వెంకట తోయ జాక్షి ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు తమ నృత్య ప్రదర్శనతో సభికులను ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరువూరు పట్టణ ఎస్సై గౌరీశ్వరి వారం రోజులపాటు గ్రంథాలయంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు గ్రంథాలయ వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

గ్రంథాలయ అధికారి సుంకర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, పుస్తకాలు మనిషికి నిజమైన విజ్ఞాన సంపదను అందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రంథాలయాలకు రావాలని సూచించారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలు, చరిత్ర, సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలను చదివే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనం ద్వారా ఆలోచనా పరిజ్ఞానం, భాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు భాషా వికాస సమితి అధ్యక్షుడు టి. ఉమా మహేశ్వరరావు, కె. విజయలక్ష్మి, అరుణ, గ్రంథాలయ సిబ్బంది జె. శ్రీలత, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.