BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:50 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఈతముక్కలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 04:50 PM
19 వీక్షణలు

బాలల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల నినాదాలు

కొత్తపట్నం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రకాశం జిల్లా కార్యదర్శి కొనిజేటి వెంకట శేషారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ బాలల హక్కులను కాపాడాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ దేశభక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెంచు పున్నయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను సంరక్షించుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.

ముఖ్య అతిథి కొనిజేటి వెంకట శేషారావు మాట్లాడుతూ.. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో భాగస్వాములైన విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.