తండ్రి ఫొటోను తుడిచిన చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
బేస్తవారిపేట: బేస్తవారిపేటకు చెందిన ఆర్మీ జవాన్ కిషన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
అంత్యక్రియల సందర్భంగా కిషన్ కుమారుడు తన తండ్రి ఫొటోకు పూలు వేసి నివాళులర్పించాడు. అనంతరం ఆ ఫొటోపై ఉన్న పూలను, చిత్రాన్ని తన చిన్న చేతులతో తుడుస్తూ కనిపించిన దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది.
తండ్రి ఇక లేరన్న విషయం పూర్తిగా అర్థం కాని వయసులో ఉన్న ఆ చిన్నారి అమాయకత్వం చూపరులను కదిలిస్తోంది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు.
తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారికి, కుటుంబ సభ్యులకు పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.