BREAKING
thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Date of Publish : 06 October 2026, 04:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి తహసీల్దార్ జి. శ్వేతకు చిరు సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 04:15 PM
5 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల తహసీల్దార్ జి. శ్వేతకు సీపీఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో మంగళవారం చిరు సత్కారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఉత్తమ పనితీరుకు అవార్డు అందుకున్న సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా కొమ్ము ఆనందం మాట్లాడుతూ చాట్రాయి మండలంలో పలువురు పేద ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూ సమస్యలు తీవ్రంగా ఉన్నందున వాటిని సకాలంలో పరిష్కరించేందుకు తహసీల్దార్ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకుని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, దళిత సంఘం నాయకుడు కే. సుజనరావు, డీటీ. కే అనిల్, ఆర్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్వో సాయికుమార్, ఏ. రజిని తదితరులు పాల్గొన్నారు.