BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 11:12 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్ జలమండలిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వరుస మరణాలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 11:12 AM
17 వీక్షణలు

టెండర్ ప్రక్రియపై ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: హైదరాబాద్ జలమండలిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ జేఏసీ పేర్కొంది. ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించడం లేదని జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. ఇటీవల మౌలాలి సర్కిల్‌లో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మల్లేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగిందని తెలిపారు.


ఇదిలా ఉండగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపై ప్రభావం చూపేలా ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రక్రియపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న 675 మంది మీటర్ రీడర్లు, వారి కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది.


ఇప్పటికే ఉద్యోగుల మరణాలతో వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోకముందే ఉన్నతాధికారులు స్పందించాలని జేఏసీ కోరింది. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం చేపట్టిన టెండర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.


మరణించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగుల ఉపాధి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ జేఏసీ ఉన్నతాధికారులను కోరింది. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసింది.