BREAKING
thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు
Test 4
Date of Publish : 18 November 2026, 03:49 pm
Posted by : KADARI RAMANA

శ్యామ్‌ గౌడ్ కోట భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
18 Nov, 2026 - 03:49 PM
7 వీక్షణలు

అక్రమంగా రెవెన్యూ రికార్డులు మార్చినట్లు ఆరోపణలు.. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఆప్ నేతల డిమాండ్

నిర్మల్: పట్టణంలోని చారిత్రక శ్యామ్‌ గౌడ్ కోటకు సంబంధించిన భూముల రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదైనట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. కోటకు సంబంధించిన ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. కోట భూములకు సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, పహానీలు, చిత్రాలు, సర్క్యులర్లు, ముంతఖబ్ తదితర కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కోట భూములకు సంబంధించి అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసినట్లు, పహానీలలో ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదు చేసినట్లు వస్తున్న ఆరోపణలపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను వ్యక్తిగత భూములుగా మార్చేందుకు అక్రమ చర్యలు జరిగి ఉంటే వాటిని గుర్తించి, సంబంధిత రికార్డులను చట్ట ప్రకారం సరిచేయాలని కోరారు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్యామ్‌ గౌడ్ కోట భూములను కాపాడటం ప్రభుత్వ, రెవెన్యూ అధికారుల బాధ్యత అని సయ్యద్ హైదర్ పేర్కొన్నారు. భూముల ఆక్రమణలు, రెవెన్యూ రికార్డుల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్పులపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని, తప్పులు నిర్ధారణైతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి, చారిత్రక సంపదను భవిష్యత్తు తరాలకు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.