BREAKING
thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు
Test 4
Date of Publish : 18 November 2026, 03:36 pm
Posted by : PEDDABOINA SRIKANTH

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
18 Nov, 2026 - 03:36 PM
11 వీక్షణలు

తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా.. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం

ఎల్కతుర్తి, నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్): రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలపై ధరల పెరుగుదల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ధర్నాలో పాల్గొన్న నాయకులు కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజలు నిత్యం వినియోగించే బియ్యం ధరలు పెరుగుతున్నాయని, రైతులు పండించిన వరి ధాన్యానికి మాత్రం తగిన ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పులు, కూరగాయల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలకు ఉపశమనం కల్పించేలా రేషన్ షాపుల ద్వారా గోధుమలు, వంటనూనె, చక్కెర, ఉప్పు, పప్పులు, సబ్బులు తదితర 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊటుకూరి రాములు, కర్రే లక్ష్మణ్, గోపాలపూర్ సర్పంచ్ కర్రె లక్ష్మి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాసు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మర్రి విజయ్, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్, రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టెముక్కుల మనోహర్ రావు, సీపీఐ నాయకులు సూర మొగిలి, ఎం. మల్లయ్య, జూపాక రవీందర్, ఊటుకూరి బిక్షపతి, బోయినపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.