BREAKING
thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి thumb ● నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు
Test 4
Date of Publish : 18 November 2026, 03:43 pm
Posted by : PEDDABOINA SRIKANTH

పరకాల వైకుంఠధామం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
18 Nov, 2026 - 03:43 PM
13 వీక్షణలు

మున్సిపల్ కమిషనర్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లేఖ

పరకాల, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): పరకాల పట్టణంలోని ప్రస్తుత శ్మశాన వాటిక (వైకుంఠధామం)ను ఆధునీకరించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ (బీఆర్ఎస్) పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముందుకొచ్చారు. తన పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పనులకు సంబంధించిన సమగ్ర అంచనాలు (Detailed Line Estimates) సిద్ధం చేయాలని కోరుతూ పరకాల మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు.

2026 సెప్టెంబర్ 5న జరిగిన పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ తన లేఖలో పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్‌లో ఆధునిక సదుపాయాలతో మోడల్ వైకుంఠధామాన్ని నిర్మించినట్లు తెలిపారు.

పరకాల మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు వరంగల్ 57వ డివిజన్‌లోని మోడల్ వైకుంఠధామాన్ని సందర్శించి, అదే తరహాలో పరకాల శ్మశాన వాటిక అభివృద్ధికి అవసరమైన అంచనాలను రూపొందించాలని కమిషనర్‌ను కోరారు. తాను పూర్వపు పరకాల మండలంలోని వరికోలు గ్రామానికి చెందినవాడినని, ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.

మున్సిపల్ అధికారులు వీలైనంత త్వరగా అంచనాలను సమర్పిస్తే, పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ లేఖలో పేర్కొన్నారు.