BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 09 August 2026, 05:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల మధ్య సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 05:04 PM
74 వీక్షణలు

ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల మధ్య సీఎం చంద్రబాబు

కొమ్ము తలపాగా ధరించి థింసా నృత్యంలో గిరిజనులతో కలిసి అడుగులు.. డప్పు చేతపట్టి ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి

అమరావతి: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఉత్సాహభరితంగా సాగాయి. అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గిరిజనులతో కలిసి సందడి చేశారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు ఆకట్టుకోగా.. ముఖ్యమంత్రి కూడా వారితో మమేకమయ్యారు. డప్పు చేతపట్టి గిరిజన కళాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం కొమ్ము తలపాగా ధరించి థింసా నృత్యంలో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు. దీంతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వాటి విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. తమ సంప్రదాయ నృత్యంలో ముఖ్యమంత్రి పాల్గొనడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.