BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్ లో ర్యాపిడో రైడర్లుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Nov, 2026 - 12:08 PM
27 వీక్షణలు

ఏడాదిగా జీతాల్లేవు.. కుటుంబ పోషణ కోసం బైక్‌ రైడర్లుగా మారిన ఉద్యోగులు!

తెలంగాణ ఆరోగ్యశ్రీ విభాగంలో 800 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతన కష్టాలు

హైదరాబాద్: ప్రభుత్వ ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతన కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 మంది ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా 11 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేట్లబురుజు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలలుగా, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని సమాచారం. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక, ఇంటి అద్దెలు కట్టలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు కొందరు ఉద్యోగులు విధులు ముగిసిన తర్వాత ర్యాపిడో బైక్ రైడర్లుగా పనిచేస్తూ అదనపు ఆదాయం సంపాదించుకుంటున్నారని తెలిపారు.

పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి, డీఎంఈ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవల్లో కీలకంగా పనిచేస్తున్న తమకు నెలల తరబడి జీతాలు అందకపోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, భవిష్యత్తులో ప్రతి నెలా జీతాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.