మంత్రి సమీక్షకు సమాచారం ఇవ్వలేదని చర్యలు..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు
వైద్యారోగ్య శాఖలోని 18 విభాగాల్లోని మానవ వనరులు, సేవల వ్యవహారాలు పర్యవేక్షించే అధికారులకు ఆ శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన దస్త్రాలెన్ని, పరిష్కరించనవి ఎన్ని, విధులకు గైర్హాజరవుతున్న వైద్యులు, సిబ్బంది ఎంతమందనే సమాచారాన్ని కార్యదర్శి కోరారు
సోమవారం మంత్రి సమీక్ష జరగనున్న నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. కానీ వరుస సెలవులు కావడంతో ఎవరూ స్పందించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యదర్శి సోమవారం జరిగిన మంత్రి సమీక్షా సమావేశంలోనే సంతకాలు చేసి మరీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.