BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 03:15 pm
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

దోసకాయలపల్లిలో తీవ్ర తాగునీటి సమస్య.. పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
26 Sep, 2026 - 03:15 PM
17 వీక్షణలు
.కోరుకొండ, Ntoday News, సెప్టెంబర్ 26: మండలంలోని దోసకాయలపల్లి గ్రామంలో గత 10 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. సుమారు 2,000 కుటుంబాలు, 6,000 మందికి పైగా జనాభా ఉన్న గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు

తాగునీటితో పాటు వంట చేసుకోవడానికి, మరుగుదొడ్ల వినియోగానికి కూడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు, ఆరు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై వైఎస్సార్‌సీపీ దోసకాయలపల్లి గ్రామ అధ్యక్షుడు K. శివకుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిశీలించి, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామానికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడంతో పాటు, నీటి సరఫరాలో ఏర్పడిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఈ వినతిపత్రం ప్రతులను దోసకాయలపల్లి గ్రామ కార్యదర్శి, కోరుకొండ ఎంపీడీవోకు అందజేసినట్లు తెలిపారు.