BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు
Test 4
Date of Publish : 25 September 2026, 04:05 pm
Posted by : ANTHATI NARENDAR

వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి....

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
Reporter
Anthati Narendar Chityala Town
25 Sep, 2026 - 04:05 PM
86 వీక్షణలు

వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.. వెలిమినేడు సబ్‌స్టేషన్‌ ఎదుట సీపీఎం, రైతు సంఘం ధర్నా

చిట్యాల: వ్యవసాయ రంగానికి అవసరమైన మేర విద్యుత్‌ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అరూరి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పంటలకు నీరు అత్యవసరంగా అవసరమైన సమయంలో విద్యుత్‌ కోతలు విధించడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు నిరంతరాయంగా, అవసరమైన మేర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, సీపీఎం మండల నాయకులు నెలికంటి నర్సింహ, పంది నరేష్, రైతు సంఘం నాయకులు సుర్కంటి మోహన్‌రెడ్డి, అరూరి శంభయ్య, ఆడపు రమేష్, సుర్కంటి పాపిరెడ్డి, నెర్లకంటి కృష్ణారెడ్డి, యంపళ్ల సత్తిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.