BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 29 August 2026, 05:58 pm
Posted by : NTODAY NEWS

ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 Aug, 2026 - 05:58 PM
65 వీక్షణలు

సైదాబాద్, ఆగస్టు 29 | ఎన్ టుడే న్యూస్

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను పురస్కరించుకుని సైదాబాద్ పరిధిలోని సరళాదేవి నగర్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి షేక్ మహమూద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువజన, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏఐవైఎఫ్ ఏర్పడిన నాటి నుంచి యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్‌తో అప్పట్లో అనేక ఉద్యమాలు నిర్వహించి, ఓటు హక్కు సాధనలో యువజన సమాఖ్య కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

విద్యార్థులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఏఐవైఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని నాయకులు గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ యువత సమస్యలపై ముందుండి పోరాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో షేక్ మహమూద్, ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి, సీపీఐ హైదరాబాద్ కౌన్సిల్ సభ్యులు రూప్‌సింగ్ నాయక్, రవి, రాజు, గణేష్, చిన్న, నాగరాజు, బసవరాజు, నాయక్, ఆంజనేయులు, శ్రీకాంత్, మహిళా నాయకురాలు కమిలివాయి తదితరులు పాల్గొన్నారు.