BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 29 August 2026, 05:46 pm
Posted by : ADARI RAMA PRASAD

ఏటికొప్పాకకు పర్యాటక హంగులు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
29 Aug, 2026 - 05:46 PM
97 వీక్షణలు

ఏటికొప్పాకకు పర్యాటక హంగులు

రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ

అనకాపల్లి జిల్లా | ఎలమంచిలి | Ntoday News

ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక గ్రామానికి పర్యాటక హంగులు అద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు.

ఏటికొప్పాక హస్తకళ, ఇతివృత్తంతో పాటు యువజన అభివృద్ధికి అవసరమైన వసతులను అభివృద్ధి చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఏటికొప్పాకకు ఉన్న ప్రత్యేక కళా, సాంస్కృతిక గుర్తింపును మరింతగా ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా మౌలిక వసతులు కల్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

ఏటికొప్పాక హస్తకళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.