BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 28 August 2026, 09:39 pm
Posted by : P. KISHORE

బస్సు డ్రైవర్ కు జరిమానా

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
28 Aug, 2026 - 09:39 PM
33 వీక్షణలు

బస్సు డ్రైవర్ కు జరిమానా

చిత్తూరు జిల్లా పోలీసు

మద్యం సేవించి విద్యార్థుల కాలేజీ బస్సు నడిపిన డ్రైవర్‌పై చర్యలు – రూ.10,000/- జరిమానా

శుక్రవారం ఉదయం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ జె.వెంకటనారాయణ ఆధ్వర్యంలో యాదమరి ఎస్.ఐ. ఈశ్వర్ వారి సిబ్బంది యాదమరి మండలం ఓటేరుపల్లి గ్రామం నుండి వేము కాలేజీకి విద్యార్థులను తరలిస్తున్న కాలేజీ బస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు డ్రైవర్‌ను Breath Analyzer ద్వారా పరీక్షించగా, అతను మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.


తవణంపల్లి మండలానికి చెందిన సదరు డ్రైవర్ లోకనాథ్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, గౌరవ II క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి కల్పన గారు మద్యం సేవించి వాహనం నడిపినందుకు రూ.10,000/- జరిమానా విధించారు.

ఈ విషయాన్ని సంబంధిత కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, సదరు డ్రైవర్ గత మూడు రోజులుగా తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం, అతనిని తక్షణమే డ్రైవర్ విధుల నుండి తొలగించినట్లు వెల్లడించింది.

విద్యాసంస్థల యాజమాన్యాలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి 

విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు దూర ప్రాంతాల నుండి స్కూల్/కాలేజీ బస్సులు, వ్యాన్ల ద్వారా రవాణా చేసే విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.


  • ప్రతిరోజూ వాహనాలు బయలుదేరే ముందు డ్రైవర్లు మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి.


  • డ్రైవర్ మద్యం సేవించలేదని, వాహనం నడపడానికి పూర్తిగా తగిన స్థితిలో ఉన్నారని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే విద్యార్థుల రవాణాకు అనుమతించాలి.


  • డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా ప్రమాణాలు మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలి.
  • తాత్కాలిక డ్రైవర్లను నియమించే సమయంలో వారి అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ప్రవర్తనా వివరాలను సైతం పరిశీలించాలి.


విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ, ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలని చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

విద్యార్థుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత – మద్యం సేవించి డ్రైవింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.