BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 August 2026, 09:35 pm
Posted by : SHAIK CHAND BASHA

పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Aug, 2026 - 09:35 PM
60 వీక్షణలు

పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

పులివెందుల | Ntoday News

పులివెందుల పరిధిలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు 27 సాయంత్రం పులివెందుల రింగ్‌రోడ్డు సమీపంలోని కే.వెలమవారిపల్లి క్రాస్ వద్ద ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరిగుట్టకు చెందిన సటుపాటి శివకుమార్ (38) నాటుసారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద ఉన్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై క్రైమ్ నంబర్ 64/2026 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

‘నవోదయం’ నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ దాడుల్లో కడప ESTF ఎక్సైజ్ సీఐ జి. విశ్వనాథ్ రెడ్డి, పులివెందుల ఎక్సైజ్ సీఐ ఎల్. చెన్నారెడ్డితో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

పులివెందుల పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు.