BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 29 August 2026, 05:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మునుకుళ్ళలో ఘనంగా భాషా దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 05:49 PM
86 వీక్షణలు

గిడుగు రామమూర్తి సేవలు తెలుగు భాషకు చిరస్మరణీయం

(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మునుకుళ్ళ)

వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలు అజరామరమని అరసం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్ పేర్కొన్నారు. గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాష వైపు తెలుగును మళ్లించి సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేసిన ఘనత గిడుగు రామమూర్తికే దక్కుతుందని అన్నారు.

భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మునుకుళ్ళ ఉన్నత పాఠశాలలో తిరువూరు రచయితల సంఘం, అరసం ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు వ్యాసరచన, పద్య పఠన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

ముందుగా గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష గొప్పతనం, భాష పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె. మురళీకృష్ణ, ఉపాధ్యాయినులు నాగరత్న కుమారి, డి. లక్ష్మీ, టి. భరతకుమారి, వేణీ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.