BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 29 August 2026, 05:44 pm
Posted by : PEDDABOINA SRIKANTH

సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
29 Aug, 2026 - 05:44 PM
65 వీక్షణలు

సూరారంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమం

ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ | ఎల్కతుర్తి | Ntoday News

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సూరారం గ్రామం నుంచి హనుమకొండ, హుజురాబాద్ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలనే ప్రజల విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడిన ఆయన, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సు రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

గ్రామంలోని పాఠశాల సమస్యలపై కూడా మంత్రి ఆరా తీశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ల వినియోగం తగ్గించాలి

పర్యావరణ పరిరక్షణపై కూడా మంత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో జరిగే వివిధ శుభకార్యాలు, ఫంక్షన్లలో పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఉపయోగించాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.