BREAKING
thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు
Date of Publish : 29 August 2026, 05:54 pm
Posted by : NTODAY NEWS

గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 Aug, 2026 - 05:54 PM
118 వీక్షణలు

ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ పిలుపు.

గోడ పత్రిక ను ఆవిష్కరించిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు.

హైదరాబాద్/ ఎన్ టుడే న్యూస్.

శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ అనుబంధ సంఘమైన తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 2026 సెప్టెంబర్ 6వ తేదీన జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను పరిష్కరించారు.

ఈ సందర్భంగా ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్ శ్రీరాం నాయక్, ఎన్సిసి సభ్యులు ఎం ధర్మ నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6 వ తేదీన జాతీయ పోరాట సదస్సు జరుగుతుందని, సెప్టెంబర్ 7వ తేదీన వేలాది మంది ఆదివాసి గిరిజనులతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, ఆర్మ్ జాతీయ నాయకులు బృందా కారత్, త్రిపుర మాజీ మంత్రి,ఆర్మ్ జాతీయ ఛైర్మెన్ జితేంద్ర చౌదరి,బెంగాల్ మాజీ పార్లమెంట్ సభ్యులు పులిన్ బస్కీలు పాల్గొంటారని తెలిపారు.16 రాష్ట్రాల నుండి ఆదివాసి గిరిజనులు, ఉద్యమకారులు పాల్గొంటున్నారని అన్నారు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసి కొత్త చట్టాలను చేసిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఐదు,ఆరు షెడ్యూల్లో భూమిపై ఆదివాసీలకు ఉన్నటువంటి హక్కులతో పాటు పేసా చట్టం,1/70 చట్టం,జీఓ నెంబర్ 3 వంటి చట్టాలను రద్దు చేసేందుకు పూనుకుందని అన్నారు. అటవీ భూములపై గిరిజనులకు కల్పించాల్సిన అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తొలగించి ఆదానీ,అంబానీ వంటి కార్పోరేట్ లకు లక్షలాది ఎకరాల అటవీ భూములను కట్టబెట్టినందుకు అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 ను తీసుకొచ్చిందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నీ రద్దుచేసి దాని స్థానంలో విబిజి గ్రామ్ జీ ప్రవేశపెట్టి కోట్లాదిమంది ఆదివాసి గిరిజనుల హక్కులను కాలరాసిందన్నారు. దేశంలో గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్త వ్యస్థంగా మార్చి మనువాద భావజాలంతో కూడిన విద్యను ప్రవేశపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యాలయాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధిత తరగతులలో సీట్లు ఇవ్వాలని అడిగిన కేటాయించలేని పరిస్థితి ఉన్నదని దీనితో విద్యకు దూరం చేసే పరిస్థితి ఉన్నదని అన్నారు.ఆదివాసి గిరిజనుల్లో నిరుద్యోగం గణనీయంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులకు ఉద్యోగ అవకాశాల్లో ప్రమోషన్లలో తీవ్ర వివక్ష జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ వాటి స్థానంలో జనరల్ కేటగిరికి మార్చేస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తోందని అన్నారు. ఎద్దేవా చేశారు గిరిజన తెగలు మాట్లాడే భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నిటిని సెప్టెంబర్ 6,7 తేదీలలో జరగబోయే సదస్సు,ధర్నా లలో చర్చించి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టేందుకు ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలు నాయక్, నగర అధ్యక్షులు వి.రాంకుమార్, ఎస్ కిషన్,రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం గోపినాయక్ తదితరులు పాల్గొన్నారు.