BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 29 August 2026, 06:35 pm
Posted by : PEETHA NANI

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Peetha Nani Parawada Mandal
29 Aug, 2026 - 06:35 PM
61 వీక్షణలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

మండల స్థాయి పోటీలకు క్రీడాకారులకు ఆహ్వానం

Ntoday News

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా మండల స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ గ్రామ అధ్యక్షుడు వరి చంద్రశేఖర్ తెలిపారు.

వరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ (గొర్లివానిపాలెం) ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పోటీల్లో పాల్గొనాలనుకునే ఆసక్తి గల క్రీడాకారులు శనివారం మధ్యాహ్నం 2 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ పోటీలను డబుల్స్ విభాగంలో మాత్రమే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రూ.300 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే క్రీడాకారులు తమ సొంత క్రీడా కిట్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే వారికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలని స్పష్టం చేశారు.

జాతీయ క్రీడా దినోత్సవం స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ పోటీల ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించవచ్చని వరి చంద్రశేఖర్ తెలిపారు.

క్రీడాభిమానులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.