BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా పరిషత్ పీఠంపై చింతమనేని సాయి నవ్యశ్రీ.. చైర్‌పర్సన్‌గా అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 06:42 AM
48 వీక్షణలు

ఉన్నత విద్యావంతురాలికి కీలక బాధ్యతలు.. మూడు తరాల ప్రజాసేవా వారసత్వంతో జిల్లా అభివృద్ధికి కొత్త సారథ్యం

ఏలూరు: ఏలూరు జిల్లా పరిషత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. పెదవేగి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవ్యశ్రీ జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధమయ్యారు. ఉన్నత విద్య, సామాజిక అంశాలపై అవగాహన, పరిశోధనా అనుభవం కలిగిన ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

చింతమనేని కుటుంబానికి ఉన్న రాజకీయ, ప్రజాసేవా నేపథ్యం నవ్యశ్రీకి వారసత్వంగా లభించగా, తన విద్యార్హతలు, ఆధునిక ఆలోచనలు, సామాజిక అంశాలపై ఆసక్తితో ప్రజాజీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ఆమెకు అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం వంటి అంశాలపై అవగాహన కలిగిన ఆమె జిల్లా పరిషత్ పాలనలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడతారన్నది ఆసక్తికరంగా మారింది.

**ఉన్నత విద్యలో ప్రత్యేక గుర్తింపు**

నవ్యశ్రీ దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల నుంచి రాజకీయ శాస్త్రంలో బీఏ ఆనర్స్ పట్టా పొందారు. అనంతరం సామాజిక నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక ఆసక్తితో సామాజిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు.

**పరిశోధనా రంగంలోనూ అనుభవం**

విద్యాభ్యాసంతో పాటు పరిశోధనా రంగంలోనూ నవ్యశ్రీ అనుభవం సంపాదించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మహాపాత్ర వద్ద పరిశోధనా సహాయకురాలిగా పనిచేస్తూ క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించారు. పౌర సేవల పరీక్షలకు సిద్ధమైన అనుభవం ద్వారా ప్రజా విధానాలు, పరిపాలనా వ్యవస్థలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంచుకున్నారు.

**జిల్లా అభివృద్ధిపై అందరి చూపు**

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నవ్యశ్రీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలను గుర్తించి, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేయడంలో జిల్లా పరిషత్‌ను మరింత క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.

రాజకీయ వారసత్వంతో పాటు ఉన్నత విద్య, పరిశోధనా అనుభవం కలిగిన నవ్యశ్రీ జిల్లా పరిషత్ పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఆమె నాయకత్వం కీలకంగా మారనుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ఎంతవరకు దోహదపడతారన్నది రానున్న రోజుల్లో తేలనుంది.