BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ జడ్పీ పీఠాల పంపకాలు ఖరారు.. 27 జిల్లాలకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 06:42 AM
51 వీక్షణలు

టీడీపీ, జనసేన, బీజేపీలకు పదవుల కేటాయింపు.. ఏలూరు జిల్లా జడ్పీ పీఠంపై చింతమనేని నవ్యశ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ పీఠాల పంపకాలపై కూటమి నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 27 జిల్లాలకు సంబంధించి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ జిల్లాల వారీగా పదవుల పంపకాలను ఖరారు చేశారు. ఈ పంపకాలలో టీడీపీకి 22 జడ్పీ చైర్మన్ స్థానాలు, జనసేనకు నాలుగు, బీజేపీకి ఒక స్థానం కేటాయించినట్లు ప్రకటించారు. జిల్లాల వారీగా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో జనసేనకు చైర్మన్ స్థానం, గుంటు విజయ్ కుమార్‌కు వైస్ చైర్మన్ బాధ్యతలు కేటాయించారు. విజయనగరం జిల్లాలో మజ్జి సిరి సహస్ర చైర్మన్‌గా, పసల నీరజ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించగా, వైస్ చైర్మన్‌గా వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌ను ప్రకటించారు. విశాఖపట్నం జిల్లాలో గాడు అలివేణి చైర్మన్‌గా, సువాసి అజయ్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. అనకాపల్లి జిల్లాలో చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించగా, పెంటకోట స్వాతికి వైస్ చైర్మన్ అవకాశం కల్పించారు.

పోలవరం జిల్లాలో వంతల రాజేశ్వరి చైర్మన్‌గా, తీగల ప్రభ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. కాకినాడ జిల్లాలో చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించగా, పిల్లి అనంతలక్ష్మికి వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లాలో కాడ పద్మ చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇందుకూరి రామకృష్ణంరాజు చైర్మన్‌గా, సిరగాని నాగేశ్వరరావు వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

ఏలూరు జిల్లాలో చింతమనేని సాయి నవ్యశ్రీకి జడ్పీ చైర్‌పర్సన్ బాధ్యతలు కేటాయించగా, బొర్రా చలమయ్య వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. కృష్ణా జిల్లాలో చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించి, దండమూడి పూజితను వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో కోట పుల్లమ్మ చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. గుంటూరు జిల్లాలో ధార అరుణ చైర్మన్‌గా, తల్లా అశోక్ కుమార్ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. పల్నాడు జిల్లాలో పుచ్చకాయల రమాదేవి చైర్మన్‌గా, నల్లపాటి కీర్తన వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. బాపట్ల జిల్లాలో పుషడపు రోహిణి చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు.

ప్రకాశం జిల్లాలో కొక్కిలిగడ్డ ప్రభాకరరావు చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. మార్కాపురం జిల్లాలో కందుల రామిరెడ్డి చైర్మన్‌గా, జి.వి. శ్రీనివాసవర్మ వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లాలో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చైర్మన్‌గా, పొట్టేళ్ల ప్రసాద్ వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. కర్నూలు జిల్లాలో చూడి ఉలిగయ్య చైర్మన్‌గా, షేక్ షాదిక వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. నంద్యాల జిల్లాలో షేక్ బ్రుహానుద్దీన్ చైర్మన్‌గా, కె. శ్రీకాంత్ రెడ్డి వైస్ చైర్మన్‌గా ప్రకటించారు.

అనంతపురం జిల్లాలో గంజే నాగరాజు చైర్మన్‌గా, వెన్నపూస లలిత వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో పరిటాల శ్రీరామ్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. వైఎస్సార్ కడప జిల్లాలో పుత్తా నరసింహారెడ్డి చైర్మన్‌గా, హబీబున్నీసా చాంద్ బాయి వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలో సుగవాసి ప్రసాద్ బాబు చైర్మన్‌గా, తలారి శరణ్య వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. తిరుపతి జిల్లాలో హేమలత చైర్మన్‌గా, వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. చిత్తూరు జిల్లాలో మాదలం శైలజ చైర్మన్‌గా, ఎస్. మంజుప్రియ వెంకటేష్ వైస్ చైర్మన్‌గా ప్రకటించారు.

జిల్లాల వారీగా అభ్యర్థుల ప్రకటనతో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలకు సంబంధించి స్పష్టత వచ్చినట్లయింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చింతమనేని నవ్యశ్రీకి జడ్పీ చైర్‌పర్సన్ అవకాశం కల్పించడం స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రకటించిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో అధికారికంగా బాధ్యతలు చేపట్టే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగనుంది. జిల్లా పరిషత్ పీఠాల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంలో కూటమి నాయకత్వం ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తుందో వేచి

చూడాలి.