BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త.. నవంబర్ 30 నుంచే డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:13 PM
8 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను నిర్ణీత తేదీ కంటే ముందుగానే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం సుమారు రూ.2,774 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. నవంబర్ నెలలో పింఛన్ తీసుకోని అర్హులకు రెండు నెలలకు కలిపి రూ.8,000 అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జాతీయ సామాజిక సహాయ పథకం (ఎన్‌ఎస్‌ఏపీ) పరిధిలో ఉన్న 9.34 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు కొత్త పింఛన్ల మంజూరు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల దరఖాస్తులు అందినట్లు సమాచారం. డిసెంబర్ నెలలో మరోసారి దరఖాస్తులను పరిశీలించే అవకాశం ఉండగా, అర్హులైన వారికి జనవరి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశముంది. మరోవైపు, పింఛన్ లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, ఎన్‌పీసీఐ లింక్ స్థితి సక్రమంగా ఉందో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా పింఛన్ నగదు జమలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.