BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖను అంతర్జాతీయ మారిటైం హబ్‌గా తీర్చిదిద్దుతాం ఏపీని గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో సౌదీ అరేబియాగా మారుస్తాం

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:14 PM
12 వీక్షణలు

2028 నాటికి 5 వేల మంది మారిటైం నిపుణులకు శిక్షణ ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి, పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ముఖద్వారంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వత భాగస్వామ్యాలను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. సముద్ర రవాణా, ఆధునిక సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నానికి శతాబ్దాల సముద్ర చరిత్ర ఉందని, తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న ఈ నగరం ప్రస్తుతం వాణిజ్యం, సాంకేతిక రంగాల్లోనూ కీలక కేంద్రంగా ఎదుగుతోందన్నారు. కళింగపట్నం, మచిలీపట్నం వంటి ప్రాచీన నౌకాశ్రయాలు భారత్, ఆగ్నేయాసియా దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు వారధులుగా నిలిచాయని గుర్తుచేశారు. మారిటైం రంగానికి కేంద్రం ప్రాధాన్యత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని లోకేష్ తెలిపారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, రవాణా, సరుకు నిర్వహణ రంగాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. నౌకా నిర్మాణం, సముద్ర రంగ అభివృద్ధికి దాదాపు రూ.70 వేల కోట్లతో కూడిన ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైం అభివృద్ధి నిధి కూడా ఉందన్నారు. దేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో పోర్టుల అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. ఏపీలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం సుమారు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు మారిటైం రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రధాన సముద్ర వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించి రికార్డు సృష్టించిందని తెలిపారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దుగరాజపట్నంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడితో భారీ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇటీవల విశాఖలో పోర్టుల విస్తరణ, సరుకు రవాణా, ప్రత్యేక టెర్మినళ్లు, నౌకల మరమ్మతులకు సంబంధించి రూ.7,500 కోట్ల విలువైన ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయని వివరించారు. విశాఖలో రూ.15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడి డిజిటల్ సాంకేతికతలోనూ విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతోందని లోకేష్ అన్నారు. నగరంలో గిగావాట్ స్థాయి కృత్రిమ మేధ కేంద్రం, డేటా కేంద్రాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖలో అనుసంధానం కానున్నాయని చెప్పారు. రుషికొండలో సిఫీ సంస్థ నిర్మిస్తున్న తొలి ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా డిజిటల్ రంగంలో నగర ప్రాధాన్యతను పెంచుతుందన్నారు. స్మార్ట్ పోర్టుల ఏర్పాటుతో సరుకు రవాణాలో జాప్యాన్ని తగ్గించడంతో పాటు భద్రత, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు లక్ష్యం సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ రంగాల్లో రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో సౌదీ అరేబియాగా ఏపీని నిలబెట్టాలని సంకల్పించినట్లు వెల్లడించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించిన అనంతరం ఏడాదికి సుమారు 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియాను జపాన్‌కు చెందిన జెరా సంస్థకు సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తులను రాష్ట్రంలోని పోర్టుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. 2028 నాటికి ఐదు వేల మందికి శిక్షణ పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. 2028 నాటికి ఐదు వేల మంది సముద్ర రంగ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర మారిటైం విధానంలో లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, సముద్ర ఇంజినీరింగ్, రవాణా నిర్వహణ, మారిటైం సాంకేతికత వంటి రంగాల్లో యువతకు అవకాశాలు కల్పించేలా ఐటీఐలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం సహా విద్యాసంస్థలను సిద్ధం చేస్తున్నామన్నారు. జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థతో కలిసి మానవరహిత సముద్ర వ్యవస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ఆసియాన్ దేశాలతో నాలుగు రంగాల్లో భాగస్వామ్యం సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి అనే నాలుగు ప్రధాన రంగాల్లో ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. స్మార్ట్ పోర్టులు, కృత్రిమ మేధ, డిజిటల్ రవాణా, సముద్ర రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా వాస్తవ ప్రాజెక్టులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విశాఖపట్నం ఇక కేవలం ఓడరేవు నగరంగా కాకుండా తూర్పు దేశాలకు భారతదేశ ముఖద్వారంగా ఎదుగుతోందని లోకేష్ పేర్కొన్నారు. బంగాళాఖాతం భారత్, ఆగ్నేయాసియా దేశాలకు ఉమ్మడి అవకాశాల వేదికగా మారాలని ఆకాంక్షించారు. సమావేశాలు, ఒప్పందాలకే భాగస్వామ్యాలను పరిమితం చేయకుండా పరిశ్రమలు, సాంకేతికత, ఉపాధి రంగాల్లో కలిసికట్టుగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామ్ మాధవ్, నౌకాదళ అధికారులు, వివిధ దేశాల రాయబారులు, ఆసియాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.