BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కార్తీక రెండో సోమవారం.. భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం మల్లన్న ఆలయం శ్రీశైలం,

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:13 PM
7 వీక్షణలు

నవంబర్ 23: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే కార్తీక సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. దీంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండగా, దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆదివారం ఒక్కరోజే స్వామి, అమ్మవార్లను 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. కార్తీక సోమవారం కావడంతో సోమవారం కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు దర్శనం, వసతి, ఇతర సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.